రామ్‌చరణ్ త్వరలోనే అమెరికా టూర్‌కి వెళ్లాల్సి వుంది. అక్కడ టెర్రరిజానికి వ్యతిరేకంగా నిర్వహించే ఓ సోషల్ ఈవెంట్లో రామ్‌చరణ్ డ్యాన్స్ కూడా వేసేందుకు ఒప్పుకొన్నాడు. ఆ మేరకు కార్యక్రమ నిర్వాహకులు పెద్దయెత్తున ఏర్పాట్లు చేసుకొన్నారు. ఆ వేడుకకి వెళుతుండడం, తొలిసారి అమెరికాలో ఒక డ్యాన్స్ షోలో పాల్గొంటుండడం ఆనందంగా ఉందని కూడా చెప్పాడు చరణ్. అలా చెప్పాడో లేదో ఇంతలో ఉన్నట్టుండి అమెరికా టూర్ నుంచి తప్పుకొన్నాడు. ఇంట్లో ఓ మెడికల్ ఎమర్జెన్సీ వల్ల టూర్ నుంచి తప్పుకోవల్సి వచ్చిందని, అన్యధా భావించొద్దని ఫేస్ బుక్‌లో పోస్ట్ పెట్టాడు. దీంతో ఫ్యాన్స్‌లో కలకలం రేగింది. చిరు ఫ్యామిలీలో మెడికల్ ఎమర్జెన్సీనా? అసలు ఎవరికేమైంది? అంటూ ఆరాలు తీయడం మొదలుపెట్టారు. ఫ్యాన్స్ ఆరాలు ఎంతకీ ఆగడం లేదు. ఆ మెడికల్ ఎమర్జన్సీ గురించి చరణ్ చెబితే తప్ప బయటికి వెళ్లడయ్యే అవకాశం లేదు. అయితే అమెరికాలోని మెగా ఫ్యాన్స్ మాత్రం చరణ్ తప్పుకోవడంతో నిరుత్సాహానికి గురైనట్టు తెలిసింది.
Subscribe to:
Post Comments
(
Atom
)

0 comments:
Post a Comment